ఈసారి మెగాస్టార్ నుంచి రాబోతున్న సినిమా మామూలుగా ఉండదని మెగా ఫ్యాన్స్ అంతా ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు బ్రేక్ ఇచ్చి.. వెకషన్కు వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. చాలా కాలం తర్వాత మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేసేలా చేసిన సినిమా ఏదంటే.. విశ్వంభర అనే చెప్పాలి. మెగాస్టార్ తన కెరీర్లో జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి వంటి సినిమాల తర్వాత చేస్తున్న భారీ ఫాంటసీ డ్రామా కావడంతో.. అనౌన్స్మెంట్ నుంచే విశ్వంభర పై భారీ హైప్ క్రియేట్ అయింది. బింబిసారతో సాలిడ్ హిట్ అందుకున్న వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్.
రీసెంట్‌గానే మొదలైన షెడ్యూల్లో మెగాస్టార్ కూడా జాయిన్ అయ్యారు. అంతేకాదు.. ఇప్పుడు ఈ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయింది. భారీ సెట్టింగ్స్ మధ్య పలు కీలక యాక్షన్ సీన్స్ ఈ షెడ్యూల్లో తెరకెక్కించినట్టుగా సమాచారం. ఇక విశ్వంభర లేటెస్ట్ షెడ్యూల్ పూర్తి కావడంతో చిరు వెకేషన్‌కు బయల్దేరారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు మెగాస్టార్. నా బెటర్ హాఫ్ సురేఖతో ఒక షార్ట్ హాలిడే కోసం USAకి బయలుదేరాను. తిరిగి వచ్చిన వెంటనే విశ్వంభర షూటింగ్లో జాయిన్ అవుతానని.. రాసుకొచ్చారు.
దీంతో విశ్వంభరలో మెగాస్టార్‌కు సంబంధించిన ఓ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయిందనే చెప్పాలి. వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ చేస్తూ.. జనవరి 10న విశ్వంభర రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.