Daggubati Abhiram: దగ్గుబాటి ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. నిర్మాత సురేశ్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ (Daggubati Abhiram) ఇంటివాడు కాబోతున్నాడు. తేజ దర్శకత్వం వహించిన అహింస మూవీతో అభిరామ్ తెరంగ్రేటం చేశారు. కానీ ఆ మూవీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఆ తర్వాత సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ లేవు. రామా నాయుడు స్టూడియోలో ఓ కేఫె కూడా ప్రారంభించారు.
బంధువు అయిన ప్రత్యూషతో అభిరామ్ పెళ్లి జరగనుంది. శ్రీలంకలో ఫైవ్ స్టార్ హోటల్లో పెళ్లి జరగనుంది. డిసెంబర్ 6వ తేదీన రాత్రి 8.50 గంటలకు డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. పెళ్లికి 200 మందికి పైగా అతిథులు హాజరవుతారని తెలిసింది. రాత్రి గ్రాండ్ డిన్నర్‌తో వివాహా వేడుక ప్రారంభం కానుంది. మంగళవారం 4.30 గంటలకు మెహంది వేడుక ఉంది. సో.. అభిరామ్ కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అభిరామ్ సోదరుడు రానా అనే సంగతి తెలిసిందే. రానాకు మిహిక బజాజ్‌తో వివాహామైంది.