HYD: మూసాపేటలో జరిగిన అగ్ని ప్రమాదంలో బైక్ మెకానిక్ షాపు దగ్ధం కావటంతో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ ఆదివారం షాపు నిర్వాహకునికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. కాగా, శనివారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో ఉపేందర్ బైక్ మెకానిక్ షాపులో పలు సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. శ్రావణ్ కుమార్ అండగా ఉంటానని భరోసా కల్పించారు.