AP: ప్రకాశం(D) ఎర్రగొండపాలెం(M) గడ్డమీదపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రమణమ్మ అనే మహిళపై తన అల్లుడు నారాయణ కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయపడ్డ రమణమ్మను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద అల్లుడు నారాయణపై అత్త బంధువు ఎదురు దాడి చేశారు. కాగా, గతంలో రమణమ్మ కూతురు కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరివేసుకుని చనిపోయింది.