విజయనగరం టౌన్ డీఎస్పీ ఆర్.గోవిందరావు డెంకాడ పోలీసు స్టేషన్ను మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఎస్సైతో కలిసి పరిశీలించారు. ప్రమాదాల నియంత్రణకు వాహన తనిఖీలు చేపట్టాలని ఎస్సైకు సూచించారు. అలాగే శిరస్త్రాణం ధరణ పై వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు.