సత్యసాయి: రొళ్ల మండలంలో అదృశ్యమైన ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారుల కేసును పోలీసులు మంగళవారం ఛేదించారు. హెచ్టీ వడ్రహట్టి గ్రామానికి చెందిన లక్ష్మి తన తల్లి సుబ్బమ్మ, పిల్లలు రచన, రోషిణిలతో కలిసి కర్ణాటకలోని ఎల్లంపురం వెళ్లినట్లు ఎస్ఐ గౌతమి తెలిపారు. ప్రత్యేక బృందం అక్కడికి చేరుకుని వారిని గుర్తించి సురక్షితంగా రోళ్లకు తీసుకొచ్చామన్నారు.