SRPT: గ్రామల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దండంపల్లి భాను మంజుల సైదులు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.