Ajay Devgn : బాలీవుడ్ అగ్రహీరో అజయ్ దేవ్ గన్ కు ప్రమాదం
బాలీవుడ్ కండల వీరుడు అజయ్ దేవగన్ నటిస్తున్న తాజా చిత్రం “సింగం రిటర్న్స్”. ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది.
Ajay Devgn : బాలీవుడ్ కండల వీరుడు అజయ్ దేవగన్ నటిస్తున్న తాజా చిత్రం “సింగం రిటర్న్స్”. ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అయితే కొన్ని యాక్షన్ సీన్స్ చేస్తున్న సమయంలో అజయ్ కంటికి గాయమైంది. అందుబాటులో ఉన్న వైద్యులు చికిత్స అందించారు. కొన్ని గంటల పాటు విశ్రాంతి తీసుకున్న అజయ్ దేవగన్ మళ్లీ షూటింగ్‌కి వెళ్లాడు. ఈ చిత్రంలో కరీనా, దీపికా పదుకొణె, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, రణ్వీర్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 2024లో విడుదల కానుంది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు అజయ్ దేవ్ గన్. ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ తండ్రి రామరాజు పాత్రలో నటించారు. ఈ సినిమాపై భారతీయ చిత్ర పరిశ్రమలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు మన దేశానికి పూర్తి స్థాయి ఆస్కార్ అవార్డు అందించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.