Prashant Neel: ప్రజెంట్ ఉన్న డైరెక్టర్స్‌లో ప్రశాంత్ నీల్ (Prashant Neel) ఓ సెన్సేషన్. కెజియఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసి.. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు నీల్. త్వరలో పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్‌తో కలిసి మాస్ జాతర చేయడానికి వస్తున్నాడు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘సలార్’ డిసెంబర్ 22న రిలీజ్‌కు రెడీ అవుతోంది. రీసెంట్గా సలార్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. డిజిటల్ రికార్డ్స్ అన్నీ బద్దలు అయ్యాయి. ప్రభాస్ కటౌట్ చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. మరోవైపు ప్రమోషన్స్ స్పీడప్ చేశారు మేకర్స్. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్, సలార్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తున్నాడు.
సలార్ ట్రైలర్ చూసిన తర్వాత.. సినేరియా మొత్తం కేజీఎఫ్ తరహాలోనే ఉందని, కథ కూడా దాదాపు అలాగే ఉందని కొందరు కామెంట్స్ చేశారు. సలార్‌ను కేజీఎఫ్ 3 అనుకోవచ్చని.. యష్ కూడా సలార్‌లో గెస్ట్ రోల్ చేసే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది. అలాగే.. ఈ సినిమా ఉగ్రమ్ రీమేక్ అనే చర్చ కూడా జరుగుతోంది. దీంతో ప్రశాంత్ నీల్ దీనిపై వివరణ ఇచ్చారు. కేజీఎఫ్‌కి సలార్‌కి అస్సలు సంబంధం ఉండదు. కేజీఎఫ్, సలార్ రెండు విభిన్న ప్రపంచాలు.. ఆ రెండింటిని కలపాలని కోరుకోను. అంత సామర్థ్యం కూడా నాకు లేదు. ప్రభాస్ అంత తేలిగ్గా కథను ఒప్పుకోరు. ఒక హిట్ సినిమాను కాపీ చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన స్థాయి కూడా అది కాదు’ అని చెప్పుకొచ్చాడు. దీంతో సలార్ కథకు కెజియఫ్‌తో సంబంధం లేదనే చెప్పాలి. కాకపోతే.. ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్‌ను బట్టి.. సలార్‌ను కెజియఫ్‌తో పోలుస్తున్నారు. ఉగ్రమ్ రీమేక్ విషయంలోనే కాస్త క్లారిటీ లేకుండా పోయింది. ఏదేమైనా.. డిసెంబర్ 22న సలార్ అసలు కథేంటనేది తేలిపోనుంది.