TPT: చంద్రగిరి మండలాన్ని అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు స్వర్ణ చంద్రగిరి ప్రణాళికలను సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్వర్ణ కుప్పం, నారావారి పల్లె తరహాలోనే సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా సీఎం ఈ ప్రణాళికలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో ఈ మేరకు సీఎం దిశానిర్దేశం చేశారు.