RR: షాద్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన మున్సిపాలిటీ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిన్న ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో గల్లీ టీమ్‌పై ఖదీర్ XI జట్టు విజయం సాధించింది. విజేతలకు ఎమ్మెల్యే శంకర్ రూ. 25,000, రన్నరప్‌కు రూ.15,000 నగదు బహుమతులు అందజేశారు. యువత క్రీడల్లో రాణించి జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో గుర్తింపు పొందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.