మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రిస్క్ చేస్తున్నాడా? అంటే, అవుననే టాక్ నడుస్తోంది. ఒకేసారి రెండు సినిమాలను హ్యాండిల్ చేస్తాడా? అది కూడా ప్రభాస్, ఎన్టీఆర్ అంటే మామూలు విషయం కాదు. మరి నీల్ ప్లాన్ ఏంటి?
Prashant Neil: ప్రశాంత్ నీల్ సినిమా అంటే, ఆ అంచనాలు మామూలుగా ఉండవు. కెజియఫ్ చూసిన తర్వాత సలార్ పై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇక సలార్ చూసిన తర్వాత సలార్ 2, ఎన్టీఆర్ సినిమా పై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఒకేసారి ఈ రెండు భారీ ప్రాజెక్ట్స్ చేస్తుండడమే.. ఇప్పుడు రిస్క్ అనే కామెంట్స్‌కు కారణమవుతున్నాయి. సలార్ 2 ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. త్వరలోనే ఉంటుందని అంటున్నారు. మే ఎండింగ్లో షూటింగ్ స్టార్ట్ చేస్తే.. కల్కి రిలీజ్ తర్వాత ప్రభాస్ షూటింగ్లో జాయిన్ అవుతాడని అంటున్నారు. నవంబర్ వరకు సలార్ 2 షూటింగ్ కంప్లీట్ అయ్యేలా టార్గెట్ పెట్టుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు.. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఆగస్ట్‌లో షూటింగ్ ప్రారంభం కానుందని ప్రకటించారు.
దీంతో.. ససలు సలార్ 2 సెట్స్ పైకి వెళ్లనే లేదు కదా? మరి ఈ రెండు ప్రాజెక్ట్‌లను ఏకకాలంలో ప్రశాంత్ నీల్ ఎలా హ్యాండిల్ చేస్తాడు? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ ప్రశాంత్ నీల్ ఒకేసారి ప్రభాస్, ఎన్టీఆర్‌ను హ్యాండిల్ చేసినా.. ఫ్యాన్స్‌కు టెన్షన్ తప్పదు. కానీ ఇప్పటికే సలార్ పార్ట్ 1తో పాటు చాలా భాగం షూటింగ్ చేశారనే టాక్ ఉంది. అలా అయితే.. ఆగష్టు వరకు సలార్ 2 మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసి, ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. అయినా కూడా.. సలార్ 2 మధ్యలో ఎన్టీఆర్ సినిమా అంటే, కాస్త రిస్క్ అనే అంటున్నారు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ శంకర్.. ఇండియన్ 2, గేమ్ చేంజర్ సినిమాలను ఏక కాలంలో షూటింగ్ చేయడం వల్ల.. చాలా డిలే అయింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్‌కు కూడా ఇలాంటి తిప్పలు తప్పవనే అంటున్నారు. మరి నీల్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.