Animal: తెలుగులో దుమ్ములేపిన సందీప్ మూవీ.. 5 కోట్లు లాభం!
అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన లేటెస్ట్ ఫిల్మ్ అనిమల్. డిసెంబర్1న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చిన అనిమల్.. భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగులో దుమ్ములేపుతోంది.
Animal: సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ (Animal) మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 356 కోట్ల గ్రాస్, 200 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఓవరాల్‌గా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయి లాభాల బాట పట్టింది. ఇక యానిమల్ మూవీ తెలుగు వెర్షన్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. రెండు రోజుల్లో మూవీ బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. మొత్తంగా ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో 35 కోట్లకుపైగా గ్రాస్‌ను, 19 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాను దాదాపు 14 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో తెలుగులో నిర్మాత దిల్‌రాజు రిలీజ్ చేశారు. దీంతో.. మూడు రోజుల్లో దిల్‌రాజుకు యానిమల్ మూవీ ఐదు కోట్ల వరకు లాభాలను మిగిల్చింది.
ఆదివారం ఎలెక్షన్స్ రిజల్ట్ కారణంగా వసూళ్లు కాస్త తగ్గినా.. సోమవారం నుంచి మళ్లీ యానిమల్ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగులో రణ్‌బీర్ కపూర్ డబ్బింగ్ మూవీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా యానిమల్ నిలిచింది.. బ్రహ్మాస్త్ర రికార్డును బ్రేక్ చేసింది. మొత్తంగా తెలుగు వెర్షన్ 25 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో సౌత్‌లో భారీ వసూళ్లను రాబట్టిన నార్త్ హీరోగా నిలిచాడు రణ్‌బీర్ కపూర్. ఇక రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన యానిమల్ మూవీలో బాబీడియోల్ విలన్‌గా నటించాడు. అనిల్‌కపూర్ కీలక పాత్రలో కనిపించాడు. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్‌సింగ్ తర్వాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్న సందీప్ రెడ్డి వంగా.. యానిమల్తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. మరి ఫైనల్ రన్లో అనిమల్ ఎంత రాబడుతుందో చూడాలి.