సలార్ వర్సెస్ డంకీ క్లాష్‌తో డిసెంబర్ 21, 22న పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ అవబోతోంది. ప్రభాస్, షారుఖ్ ఖాన్ మధ్య జరగబోయే ఈ వార్ ఇండియాలోనే బిగ్గెస్ట్ క్లాష్‌గా నిలవనుంది. ఇప్పటికే సలార్ ట్రైలర్ రిలీజ్ అవగా.. ఇప్పుడు డంకీ ట్రైలర్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు.
Dunky: డిసెంబర్ 21న డంకీ (Dunky), 22న సలార్ పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ క్లాష్‌కు దిగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. రీసెంట్గా సలార్ ట్రైలర్ రిలీజ్ చేయగా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. 24 గంటల్లో 116 మిలియన్స్ వ్యూస్ దక్కించుకొని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కానీ డంకీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ పెద్దగా సందడి చేయలేదు. డ్రాప్ వన్, టు, త్రీ పేరుతో ఒక గ్లింప్స్, రెండు సాంగ్స్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ట్రైలర్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను మొదట డిసెంబర్ 7న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు చెప్పిన డేట్ కంటే రెండు రోజులు ముందుగానే, అంటే డిసెంబర్ 5న డంకీ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పటికే సలార్ ట్రైలర్ దెబ్బకు డంకీతో పాటు మిగతా డిజిటల్ రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయ్యాయి. దీంతో డంకీ ట్రైలర్ ఎలా ఉండబోతోంది? సలార్ ట్రైలర్ రికార్డ్‌ను డంకీ బ్రేక్ చేస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చాడు షారుఖ్. అదే జోష్‌తో ఇప్పుడు ‘డంకీ’ సినిమాను డిసెంబర్ 21న ఆడియెన్స్ ముందుకు తీసుకువస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. షారుఖ్ సరసన తాప్సీ పన్ను హీరోయిన్గా నటించింది. మరి డంకీ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.