Salar: మరొక యూనివర్స్‌తో సలార్ క్రాస్ ఓవర్.. ఎన్టీఆర్ సినిమానే?
తాజాగా సలార్ సినిమాలో వరద రాజ మన్నార్ పాత్రలో నటించిన పృధ్వీరాజ్ సుకుమారన్ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరొక యూనివర్స్‌తో సలార్ క్రాస్ ఓవర్ ఉంటుందని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
Salar crossover with another universe.. NTR movie?
Salar: సలార్ సినిమాలో వరదరాజ మన్నార్, శివ మన్నార్ అనే రెండు పాత్రలను పోషిస్తున్నాడు పృథ్విరాజ్ సుకుమార్. పార్ట్1లో వరద రాజ మన్నార్‌ను చూశాం.. పార్ట్ 2లో శివ మన్నార్‌ను చూడబోతున్నాం. జగపతి బాబు పోషించిన రాజ మన్నార్ తండ్రి పాత్రనే శివ మన్నార్. తాజాగా.. ఈ శివ మన్నార్ పాత్ర గురించి ఊహించని అప్టేట్ ఇచ్చాడు పృద్వీ. శివ మన్నార్ పాత్రను మరింత చూడాలనుకుంటున్నామని ఓ యూజర్ ట్వీట్ చేయగా.. పృథ్విరాజ్ సుకుమారన్ ఇచ్చిన రిప్లే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. శివ మన్నార్ పాత్ర సలార్‌లో మాత్రమే కాకుండా వేరే యూనివర్స్‌లోనూ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ‘ప్రశాంత్ నీల్ నాకు చెప్పిన అన్ని కథల్లో.. శివమన్నార్ స్టోరీ కూలెస్ట్ అనిపించింది. మరొక యూనివర్స్‌తో నమ్మశక్యం కానీ విధంగా క్రాస్ ఓవర్ ఉంటుంది..’ అని పృథ్విరాజ్ అన్నాడు. అంటే, సలార్ సినిమాతో ప్రశాంత్ నీల్ వేరే సినిమాలకు ఖచ్చితంగా లింక్ ఉంటుందన్న మాట.
దీంతో.. ఏ సినిమాతో సలార్ యూనివర్స్‌తో లింక్ ఉంటుందనే చర్చ జరుగుతోంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుత సినిమాలను తీసుకుంటే.. ఉంటే, ఎన్టీఆర్ సినిమాతోనే సలార్‌కు లింక్ ఉండాలి. ఇప్పటికే అనౌన్స్ చేసిన ఎన్టీఆర్ ప్రీ లుక్ సలార్ లాగే డార్క్ థీమ్‌తో ఉంది. సలార్ 2 తర్వాత ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. దీంతో.. అసలు నీల్ ఏం ప్లాన్ చేస్తున్నాడనేది అంతుబట్టకుండా ఉంది. ప్రశాంత్ నీల్ యూనివర్స్‌లో భాగంగా ప్రభాస్, ఎన్టీఆర్ కలిసి కనిపించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ ఇదే జరిగితే.. థియేటర్లు కాదు పాన్ ఇండియా బాక్సాఫీస్ తగలబడిపోతుంది. అయితే.. ఇక్కడ మరో డౌట్ ఏంటంటే.. ఎలాగూ కెజియఫ్ 3 అనౌన్స్ చేశాడు కాబట్టి.. శివ మన్నార్ పాత్రకి కెజియఫ్‌తో కూడా క్రాస్ ఓవర్‌కి ఛాన్స్ లేకపోలేదు. కానీ.. దాదాపుగా ఎన్టీఆర్ 31తోనే సలార్‌కు లింక్ ఉండే అవశాలు ఎక్కువుగా ఉన్నాయి. మరి ప్రశాంత్ నీల్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.