»Prabhas A Double Century Four Centuries Datij Prabhas
Prabhas: ఒక డబుల్ సెంచరీ, నాలుగు సెంచరీలు.. దటీజ్ ప్రభాస్!
ప్రభాస్, రాజమౌళి కలిసి బాహుబలి అనే సినిమా చేయకపోయి ఉంటే.. ఈరోజు వందల కోట్ల సినిమాలు వచ్చేవి కావు. తెలుగు సినిమా హాలీవుడ్ స్థాయికి వెళ్లేది కాదు. ఇక ఇప్పుడు కల్కితో హాలీవుడ్ సినిమానే చూపించాడు ప్రభాస్. అంతేకాదు.. ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాడు.
Prabhas: A double century, four centuries.. Datij Prabhas!
Prabhas: హైయెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన హీరోగా రేర్ రికార్డ్ క్రియేట్ చేశాడు. కల్కి సినిమా ఫస్ట్ డే 191.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో.. వరుసగా 5 సెంచరీలు కొట్టాడు ప్రభాస్. ఇండియన్ టాప్ 10 ఓపెనింగ్స్ అందుకున్న సినిమాల్లో కల్కి థర్డ్ ప్లేస్‌లో నిలిచింది. టాప్ ప్లేస్‌లో 223 కోట్లతో ఆర్ఆర్ఆర్ ఉంది. ఆ తర్వాత 217 కోట్లతో బాహుబలి 2 ఉంది. ఇప్పుడు 191.5 కోట్లతో కల్కి థర్డ్ ప్లేస్‌లో నిలిచింది. ఇక 178 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన సలార్ నాలుగో ప్లేస్‌కి వెళ్లిపోయింది. 140 కోట్లతో ఆదిపురుష్ ఏడో ప్లేస్, 130 కోట్లతో సాహో తొమ్మితో స్థానంలో ఉంది. మొత్తంగా.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర టాప్ టెన్ హెయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల్లో ఐదు సినిమాలు ప్రభాస్‌వే కావడం విశేషం.
అంతేకాదు.. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేసిన ఐదు సినిమాల్లో ఒక్క రాధే శ్యామ్ తప్పితే.. సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి వరుసగా వంద కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టాయి. దీంతో.. ఇండియా ఫిలిం ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో క్రియేట్ చేయలేని రికార్డ్ ప్రభాస్ సాధించాడు. ఓపెనింగ్ రోజు 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి.. ఏకంగా ఐదు సినిమాలతో సరికొత్త రికార్డ్ సెట్ చేశాడు. ఇప్పటివరకు ఇండియాలో ఉన్న ఏ హీరో సినిమాలకు కూడా ఓపెనింగ్ రోజు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చిన సినిమాలు ఇన్ని లేవు. బాలీవుడ్ ఖాన్ త్రయం షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్లకు కూడా ఇది సాధ్యం కాలేదు. కానీ ప్రభాస్ ఒక్కడే ఈ రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతేకాదు.. ఇప్పటి వరకు చూసుకుంటే బాహుబలి 2తో డబుల్ సెంచరీ కొట్టిన రికార్డ్ కూడా ప్రభాస్ పేరు మీదే ఉంది. ఏదేమైనా.. ప్రభాస్ అంటే, ఇప్పుడో పవర్ ఫుల్ బ్రాండ్ అని చెప్పొచ్చు.