MDK: యాసంగి సీజన్లో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని రైతులు ఆందోళన చెందవద్దని నర్సాపూర్ సహాయ వ్యవసాయ సంచాలకులు సంధ్యారాణి సూచించారు. మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి సంధ్యారాణతో కలిసి పరిశీలించారు. ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. నిరంతరం రైతులకు సరిపడా యూరియా సరఫరా చేస్తామన్నారు.