స్టార్ బ్యూటీ సమంతకు హీరోయిన్లుగా అవకాశాలు తగ్గాయి. ఆమె కూడా సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తోంది. అయితే.. లేటెస్ట్గా ఈ హాట్ బ్యూటీకి భారీ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఏ స్టార్ హీరోతో రొమాన్స్ చేయనుంది?
Samantha: గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది సమంత. మయోసైటిస్ కారణంగా అమ్మడు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కొన్నాళ్లు ట్రీట్మెంట్ తీసుకున్న సామ్.. వెకేషన్ కూడా ఎంజాయ్ చేసింది. ఇప్పుడు సామ్ దాదాపుగా కోలుకున్నట్టేనని చెబుతూ వస్తోంది. దీంతో.. వరుస సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతానికి సామ్ నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. కానీ సినిమాలు మాత్రం ఒక్కటి కూడా చేయడం లేదు. రీసెంట్‌గానే తన సొంత బ్యానర్లో ‘మా ఇంటి బంగారం’ అనే లేడీ ఓరియేంటేడ్ సినిమాను అనౌన్స్ చేసింది.
అయితే.. ఇంకా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు హీరోయిన్గా భారీ ఆఫర్ అందుకున్నట్టుగా తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ 69వ సినిమాకు ప్లానింగ్ జరుగుతోంది. కెవిఎన్ ప్రొడక్షన్స్‌లో ఒక సినిమా కమిట్ అయ్యాడు విజయ్. ఇప్పటికే పొలిటికల్ పార్టీ ప్రకటించాడు విజయ్. దీంతో ఇదే చివరి సినిమా అని అంటున్నారు.
ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా సమంత ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. గతంలో విజయ్, సమంత ఇద్దరు కలిసి తేరి, మెర్సల్ వంటి సినిమాలో నటించారు. ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో.. ఈ క్రేజీ కాంబో ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. అన్నట్టు. మళయాళంలో మమ్ముట్టి, గౌతమ్ వాసుదేవ మీనన్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో కూడా సమంత హీరోయిన్గా ఫిక్స్ అయినట్లుగా టాక్.