»Thalaivar 171 Rajinikanth Lokesh Kanagaraj Film Coolie Teaser Is Out
Rajinikanth: కూలీగా రజనీకాంత్.. హై ఓల్టేజ్ యాక్షన్ టీజర్
రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం టీజర్ వచ్చేసింది. తలైవా171 చిత్రానికి కూలీ అనే టైటిల్ పెట్టారు. మరీ మూడు నిమిషాలకు పైగా ఉన్న ఈ టీజర్ ఎలా ఉందో చూద్దామా.
Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న చిత్రం టీజర్ వచ్చేసింది. మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఆయన తలైవా171 సినిమా తెరకెక్కుతున్న ఈ మూవీకి కూలీ అనే టైటిల్ ఖారారు చేశారు. తాజాగా ఆయన అభిమానుల కోసం టైటిల్ అండ్ టీజర్ విడుదల చేశారు. 3 నిమిషాల 16 సెకన్లు ఉన్న ఈ టీజర్ యాక్షన్ ప్రీయులకు కన్నుల పండుగలా ఉంది. రజనీకాంత్ ఫ్యాన్స్ అంచనాలకు మించి ఈ టీజర్ ఉంది. లోకేష్ గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం కాన్సెప్ట్ కనిపిస్తుంది. ఈ సారి డ్రగ్స్, గన్స్ కాకుండా గోల్డ్ చుట్టు కథ తిరిగేలా కనిపిస్తుంది.
టీజర్లో రజనీకాంత్ చెప్పే డైలాగ్స్ ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉన్నాయి. మంచి చేడు అన్ని పక్కన పెట్టి లైఫ్‌ను ఎంజాయ్ చేయి అనేలా డైలాగ్స్ ఉన్నాయి. ముందు ఉంది, చిందు ఉంది, సుఖం ఉంది, అనుభవించే మనసుంటే స్వర్గంలో చోటు ఉంటుంది పోరా అనే డైలాగ్ బాగుంది. ఇక లాస్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి పాట ఉంది. అబ్బనీ తియ్యని దెబ్బ పాటను రజనీ విజిల్ వేస్తాడు ఇది కూడా బాగుంది. ఈ మూడు నిమిషాల టీజర్లో భారీ యాక్షన్ సీన్‌తో ప్లాన్ చేశారు. ఇక టీజర్ చూస్తుంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అర్థం అవుతుంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కాకుండా యూనిక్ కాన్సెప్ట్‌తో కూలీని రూపొందించినట్లు అనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో కింగ్ నాగార్జున నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. అనిరుధ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మార్క్ కనిపిస్తుంది. సన్ పిక్షర్స్ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం విడుదల తరువాత ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.