MNBCL: క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్పర్సన్గా గొడిసెల సంధ్యారాణి-రాజా రమేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అల్లర్ల మధ్య వాయిదా పడి ఈ నెల 4న జరిగిన ఎన్నికల ద్వారా బీఆర్ఎస్ అభ్యర్థి గొడిసెల సంధ్యారాణి ఛైర్పర్సన్గా, సీపీఐ అభ్యర్థి మిట్టపల్లి సరిత వైస్ ఛైర్పర్సన్గా ఎన్నికయ్యారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని సంధ్యారాణి తెలిపారు.