స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మంచి స్టార్ డమ్ అనుభవిస్తున్న శృతి.. లేటెస్ట్గా ఆటోలో వెళ్లిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ బ్యూటీకి ఆటోలో వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
Shruti Haasan who went in an auto.. Do you know why?
Shruti Haasan: ఈ మధ్య కాస్త ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది స్టార్ బ్యూటీ శృతి హాసన్. చివరగా సలార్ సినిమాతో హిట్ అందుకున్న శృతి.. రీసెంట్గా దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో ఇనిమెల్ అనే ఒక సాంగ్ చేసి హాట్ టాపిక్ అయింది. ఈ సాంగ్‌లో లోకేష్‌తో కలిసి రొమాంటిక్‌గా రెచ్చిపోయింది అమ్మడు. దీని కారణంగానే తన బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ అయ్యిందనే రూమర్స్ కూడా వైరల్ అయ్యాయి. గత కొన్నాళ్లుగా శాంతాను హజారికా ప్రేమలో ఉంది శృతి. కానీ ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య చెడిందని.. బ్రేకప్ తీసుకున్నట్టుగా టాక్ నడుస్తోంది. అయితే.. ఈ విషయంపై శృతిహాసన్ ఇప్పటి వరకూ స్పందించలేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా శృతి హాసన్ ఆటోలో షూటింగ్ వెళ్లిన వార్త వైరల్‌గా మారింది. రీసెంట్గా ముంబైలో ఒక సినిమా షూటింగ్‌కు వెళ్తున్న సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యిందట. దీంతో చేసేదేమి లేక.. కారు ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో శృతి హాసన్ కొద్ది దూరం నడిచి వెళ్లి, అక్కడ నుంచి ఆటోలో షూటింగ్ లొకేషన్‌కి వెళ్లిందట. ఈ విషయాన్ని చెబుతూ.. స్వయంగా శృతి హాసన్ సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. దీంతో అది కాస్త వైరల్‌గా మారింది. అయితే.. శృతిహాసన్ ఏ చిత్రం షూటింగ్లో పాల్గొంటొంది అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. అమ్మడు చేసిన పనికి నెటిజన్లు మాత్రం శృతి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ బోల్డ్ బ్యూటీ సలార్ 2లో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. దీంతో పాటు ఇంకొన్ని సినిమాలు చేస్తోంది శృతి.