»Police Drive Van Inside Aiims Emergency Ward To Arrest Nursing Officer Accused Of Sex Abuse On Cam
Police Van : అత్యుత్సాహం..! నేరుగా ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డ్‌లోకి పోలీసుల వెహికిల్
నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు అత్యుత్సాహం చూపించారు. నేరుగా ఆసుపత్రి లోపలున్న ఎమర్జెన్సీ వార్డులోకి కారును నడుపుకుంటూ వచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Police Van : పోలీసులు ఏకంగా ఆసుపత్రి లోపల ఉన్న ఎమర్జెన్సీ వార్డు దగ్గరకు నేరుగా కారు నడుపుకుంటూ వచ్చారు. అడ్డొచ్చిన పేషెంట్ల బెడ్లను పక్కకు జరుపుతూ కారును ముందుకు నడిపించారు. ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులు సైతం పోలీసులకు సహకరించారు. నిందితుడిని అరెస్టు(Arrest) చేసేందుకు పోలీసులు చూపిన ఈ అత్యుత్సాహం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్లోహల్చల్ చేస్తోంది.
ఈ ఘటన రిషికేశ్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్AIIMS)లో చోటు చేసుకుంది. ఆ ఆసుపత్రిలోని నర్సింగ్ ఆఫీసర్ ఓ వైద్యురాలిపై లైంగిక వేధింపులకు( Sex Abuse) పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వైద్య విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఆ అధికారిని అరెస్టు చేసేందుకు పోలీసులు ఇలా ఆసుపత్రి ఓపీడీ వార్డులోకి కారు వేసుకుని వచ్చారు. నేరుగా ఎమర్జెన్సీ వార్డు(Emergency Ward) దగ్గరకు కారు వేసుకుని వచ్చి అతడిని అరెస్టు చేశారు. ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్లో వైరల్ గా మారింది. అక్కడ బెడ్లపై పడుకుని ఉన్న పేషెంట్లను పోలీసులు(Police) ఏ మాత్రం పట్టించుకోలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చాలా అశ్రద్ధగా వారు వ్యవహరించారని అంటున్నారు. ఇలా రోగులకు అసౌకర్యం కలిగించడంపై మండిపడుతున్నారు. ఇలాంటి పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కామెంట్లు చేస్తున్నారు.
Rishikesh 📍
Rishikesh Police drove their car inside OPD of AIIMS Rishikesh.