మహారాష్ట్రలోని పూణె-సోలాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి కారు నుజ్జునుజ్జు కాగా, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో మహిళకు తీవ్ర గాయాలవడంతో ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.