»Pinneli Ramakrishna Reddy Former Ycp Mla Arrested
Pinnelli Ramakrishna Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల సమయంలో ఈవీఎంల ధ్వంసం చేయడం, అడ్డుకున్నవాళ్లపై దాడి చేయడంతో ఆయనపై కేసు నమోదు అయ్యింది. అయితే ఈ కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
Pinneli Ramakrishna Reddy: Former YCP MLA arrested
Pinnelli Ramakrishna Reddy: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల సమయంలో ఈవీఎంల ధ్వంసం చేయడం, అడ్డుకున్నవాళ్లపై దాడి చేయడంతో ఆయనపై కేసు నమోదు అయ్యింది. అయితే ఈ కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. నరసరావుపేటలో అతన్ని అరెస్టు చేసి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన నాలుగు కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది.
గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసిన ధర్మాసనం నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల పోలింగ్ రోజు పాల్వయిగేటు పోలింగ్ బూత్‌లో ఈవీఎంను బద్దలుకొట్టడంతో పాటు అడ్డుకున్న టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపైన దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనిపై ప్రశ్నించిన మహిళపై కూడా తప్పుగా మాట్లాడి బెదిరించారు. పోలింగ్ తర్వాత రోజు కూడా కారంపూడిలో అరాచకం సృష్టించారు. వీటిన్నింటిపైన పోలీసుల కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు నిరాకరించింది. దీంతో పోలీసులు పిన్నెల్లిని అరెస్టు చేశారు.