ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కడుపు ఉబ్బరం, అసిడిటీ, గ్యాస్ వంటి జీర్ణసమస్యలు తలెత్తుతాయి. వీటిలో కేలరీలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఊబకాయానికి దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరిగి.. గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. మొటిమలు వచ్చే అవకాశం ఉంది. డయాబెటిస్ రావొచ్చు. మెదడు పనితీరు దెబ్బతింటుంది.