»The Attack On Trump Was With A Well Planned Plan The Police Disclosed The Details
Donald Trump: ట్రంప్‌పై కాల్పులు.. దుండగుల ప్లాన్ వెల్లడించిన పోలీసులు
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌పై కాల్పల వెనుక పక్కా ప్లాన్ వేశారని పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో వాడిన గన్ ఏంటీ, దాని రేంజ్ ఏంటి దీని వెనుకాల ఎవరు ఉన్నారో అన్నింటిని మీడియాతో చెప్పారు.
The attack on Trump was with a well-planned plan.. The police disclosed the details
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై గన్ ఫైర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి పక్కా ప్లాన్‌తో జరిగిందని పోలీసులు చెబుతున్నారు. శనివారం పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ట్రంప్ ప్రసంగిస్తుండుగా ఈ దాడి జరిగింది. అయితే ఆ సభా స్థలానికి దగ్గర్లోని ఓ ఇంటిపై షూటర్ ముందుస్తుగా ఉన్నాడని చెప్పారు. కాల్పులు జరిగిన వెంటనే ఓ స్నైపర్ ఆ షూటర్‌ను కాల్చాడు. వెంటనే పోలీసులు ఆ స్థలానికి వెళ్లారు. దాని చుట్టూ పరిశీలించారు. ఆ ఇంటిపైకి ఎక్కడానికి షూటర్ ఒక నిచ్చెనను ఏర్పాటు చేసుకున్నాడని తెలిపారు. ఇక ట్రంప రావడానికి చాలా సమయం ముందునుంచే ఆ వ్యక్తి పైన వెయిట్ చేసినట్లు చెప్పారు. అలాగే ట్రంప్ పొజిషన్, స్టేజ్ సెట్టింగ్ అన్ని అంశాలను ముందుగానే చూసుకొని గన్ పొజిషన్లో అమర్చుకున్నట్లు తెలిపారు.
ట్రంప్‌పై కాల్పులు జరిపిన వ్యక్తి పేరు థామస్ మాథ్యూ క్రూక్, అతని వయసు 20 ఏళ్లు ఉంటాయని స్థానికుడని కొన్ని కథనాలు వెలుబడినా అతని వివరాలు ఏవీ దర్యాఫ్తు సంస్థలు ధ్రువీకరించలేదు. అతని పేరును కూడా చెప్పలేదు. దీన్ని పోలీసులు హత్యాయత్నంగానే చూస్తున్నారని, ఈ మేరకు పోలీసలు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎఫ్‌బీఐ అధికారికంగా ప్రకటించింది. ట్రంప్‌పై దాడికి ఉపయోగించిన గన్ ఏఆర్-15 అని సీక్రెట్ సర్వీస్ పోలీసులు తెలిపారు. దీనితో 182 మీటర్ల దూరం నుంచి కాల్చినట్లు గుర్తించారు. సభావేదికకు ఎదురుగా ఉన్న బిల్డింగ్ నుంచి ఆ నిందితుడు మొత్తం 6 రౌండ్లు కాల్చినట్లు చెప్పారు. అందులో ఒక బుల్లెట్ ట్రంప్ చెవికి తాకింది. దాంతో గాయమై తీవ్ర రక్తస్రావం జరిగిందని అధికారులు తెలిపారు.
Nach dem Attentat steht #Trump auf und ballt die Faust.