»Raghurama Krishnam Raju Comments On Jagan Mohan Reddy Government
raghurama : తనను జైల్లోనే చంపాలని చూశారన్న రఘురామకృష్ణం రాజు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పులను ఎత్తి చూపించినందుకు తనను జైల్లోనే చంపేయాలని ప్రయత్నించారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంపై ఇంకా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
raghurama krishnam raju : నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు రాజమండ్రిలో అభిమానులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను అరెస్టు చేసి జైల్లో పెట్టిన సమయంలో అక్కడ తనను చిత్ర హింసలకు గురి చేశారని చెప్పారు. తనను అక్కడే చంపేయాలని చూశారని గుర్తు చేసుకున్నారు.
పోలీస్ కస్టడీలో ఉన్న తనను మాస్కులు ధరించిన ముగ్గురు వ్యక్తులు చిత్ర హింసలకు గురి చేశారని, తెల్ల కాగితంపై సంతకం పెట్టాలంటూ వేదించారని రఘు రామ కృష్ణం రాజు(raghurama krishnam raju) తెలిపారు. రెవెన్యూ అధికారులు, తహశీల్దార్ సైతం పేపరుపై సంతకాలు చేయాలని లేదంటే ఇక్కడే చంపేస్తామని బెదిరించినట్లు వెల్లడించారు. కోర్టులో హాజరు పరిచిన తర్వాత ఏమీ మాట్లాడవద్దని, నోరు విప్పితే ఇక అంతే సంగతులని తనను భయభ్రాంతులకు గురి చేసినట్లు తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి(jagan mohan reddy) ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీరు సరిగ్గా లేదని తప్పుపట్టారు. ప్రభుత్వ పనుల్లో కమిషన్లు ఆశించడం సరికాదని తాను ఆయనకు చెప్పానని అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని తనపై ఆయన కక్ష కట్టారని అన్నారు. జైల్లో నన్ను అంతగా హింసిస్తూ కోర్టుకు తీసుకెళుతున్న సమయంలో మీడియాని, పత్రికలని కూడా అనుమతించలేదని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తన కాళ్లను ఎవరో ధైర్యం చేసి ఫోటోలు తీసి మీడియాఓ వేశారని, ఆ చర్యతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఆయన తెలిపారు.