Food Safety Department Inspections : ఈ మధ్య కాలంలో ఫుడ్ సేఫ్టీ(Food Safety) అధికారులు, టాస్క్‌ఫోర్స్ బృందాలు వరుసగా హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారవు. రెస్టారెంట్లలో దారుణంగా నిల్వ ఉంచుతున్న ఆహార పదార్థాలను వెంటనే డస్ట్ బిన్‌ల్లో వేశారు. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పనీర్, దారుణంగా ఉన్న ఫ్రిజ్‌లు, సరిగ్గా శుభ్రం చేయని గిన్నెల్లాంటివి హోటళ్లలో వారికి దర్శనం ఇచ్చాయి. బొద్దింకల్లాంటి వాటిని కంట్రోల్ చేయడానికి సరైన వ్యవస్థలను సైతం కొన్ని హోటళ్లలో ఏర్పాటు చేసుకోలేదు.
హైదరాబాద్‌లోని బడా హోటళ్లలో ఒకటైన క్రుతుంగ రెస్టారెంట్లో లైసెన్స్ లేని పనీర్ ప్యాకెట్లు ఉండటాన్ని గుర్తించారు. అలాగే ఏప్రిల్ 3వ తారీఖుతో డేట్ అయిపోయిన రూ.18000 విలువైన మలైని కనుగొన్నారు. క్రుతుంగ బ్రాండ్‌తో ఉన్న టీడీఎస్ 4పీపీఎంగా ఉన్న 156 తాగునీటి సీసాలను, నాసికరకం మసాలాలను గుర్తించారు. అక్కడు ఫ్రిజ్‌లో అన్ని మాంసాలను కలిపి ఒక్కచోటే ఎలాంటి ప్యాకింగ్ లేకుండా ఉండటాన్ని కనుగొన్నారు. అక్కడే ఆహార పదార్థాలు సైతం పెట్టడాన్ని గుర్తించారు. వాటన్నింటినీ అక్కడికక్కడే చెత్త డబ్బాలో వేసి నోటీసులు ఇచ్చారు. ఆ ఆహార పదార్థాలు, మాంసాల నమూనాలను పరీక్షలకు పంపించారు.
అలాగే ప్రముఖ కేఎఫ్‌సీ రెస్టారెంట్లో(Restaurant) ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు అసలుది కాకుండా నకిలీది ఉండటాన్ని గుర్తించారు. అక్కడ వంట గదుల్లో పని చేసే ఉద్యోగుల శుభ్రత విషయంలో రెస్టారెంట్( Restaurant) యాజమాన్యం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. వారి వైద్య పరీక్షలకు సంబంధించిన సర్టిఫికెట్లు కూడా లేవు. అలాగే అక్కడ పురుగులు, బొద్దింకల్లాంటి వాటిని నియంత్రించేందుకు సరైన వ్యవస్థ ఏమీ లేదు. వారం రోజుల క్రితం మరో ఐస్‌క్రీం పార్లర్లో బొద్దింకలు, ఫంగస్‌ని అధికారులు గుర్తించారు.