ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. అత్యల్పంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని గజసింగారంలో 9.1°Cగా నమోదైంది. అటు జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో 10.1°C, పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ములకాలపల్లిలో 10.3°C, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్ నగర్లో 10.5°Cగా నమోదయ్యాయి.