AP: కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ కొనసాగుతోంది. మంటల తీవ్రత తగ్గినా పూర్తి నియంత్రణకు ఓఎన్జీసీ ముమ్మర చర్యలు చేపట్టింది. గూడపల్లి నుంచి నీటిని వినియోగించుకుని అగ్నికీలలను సిబ్బంది చల్లారుస్తున్నారు. బ్లో అవుట్‌తో సుమారు 3 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ దగ్ధమైనట్లు అధికారులు అంచనా వేశారు.