గత నెలలోనే కదా వైజాగ్ టు హైదరాబాద్ వందే భారత్ ట్రెయిన్‌ను లాంచ్ చేసింది. ఈ ట్రెయిన్ లాంచ్ అయి నెల కూడా కాలేదు. అప్పుడు రైలుపై పలు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇటీవల ట్రెయిన్లో ప్రయాణికులు చెత్త, వాటర్ బాటిల్స్ పడేసి.. రైలు మొత్తాన్ని చెత్తతో నింపేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది కదా. ఆ ఫోటోపై రైల్వే శాఖ వెంటనే స్పందించింది. రైలులో చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా సహాయక సిబ్బందిని నియమించారు. ఏదైనా చెత్త ఉంటే వాళ్లు తీసుకొచ్చిన సంచుల్లో వేసేలా చర్యలు తీసుకున్నారు.
అంతవరకు బాగానే ఉంది కానీ.. ఇప్పుడు ఆ ట్రెయిన్లో ఫుడ్ బాగోలేదు అంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రూ.120 పెట్టి టిఫిన్ తీసుకుంటే.. అందులో ఇచ్చిన వడ మొత్తం ఆయిల్ ఉందని.. వడను పిండిన కొద్దీ నూనె కారుతుందంటూ ఓ ప్రయాణికులు ఫిర్యాదు చేశాడు. దాన్న ఓ జర్నలిస్ట్ వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోపై రైల్వే శాఖ స్పందించింది. ఫుడ్‌కు సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులకు సమాచారం అందించామని.. ఇంకోసారి నూనె వాడకంలో తేడా రాదు అన్నట్టుగా ఐఆర్సీటీసీ ట్విట్టర్ పేజి ద్వారా స్పందించారు రైల్వే అధికారులు. ఇక.. నెటిజన్లు ఆ వీడియోను తెగ వైరల్ చేసేస్తున్నారు. అవును.. మాకు కూడా ఇలాంటి ఘటన ఎదురైంది. చాలాసార్లు మాకు వచ్చిన ఫుడ్ బాగోలేదు అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇంకొందరు నెటిజన్లు.. వందే భారత్ రైలుపై, రైల్వే శాఖపై ఫైర్ అయ్యారు.