TG: PM ఈ-బస్ సేవ పథకం కింద రాష్ట్రానికి 151 EV బస్సులను కేంద్రం కేటాయించింది. వీటిల్లో వరంగల్‌కు 100, నిజామాబాద్‌కు 51 మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి టోకన్ సాహు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఆయా ప్రాంతాలకు తరలించలేదని చెప్పారు. ఈ బస్‌ల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేసిన తర్వాతే వాటిని తరలించనున్నట్లు తెలిపారు.