HYD: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలో ఇవాళ ‘రన్ ఫర్ ఇండియా’ మారథాన్ నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు గచ్చిబౌలి స్టేడియం, విప్రో జంక్షన్, టీఎన్జీవోస్ కాలనీ మీదుగా రన్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులు ఈ మార్గాలకు బదులుగా ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని సూచించారు.