AP: మాజీ సీఎం జగన్పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మరోసారి విమర్శలు చేశారు. జగన్కు బలప్రదర్శనపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని మండిపడ్డారు. కల్తీపాల ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించే తీరిక మాజీ సీఎంకు లేదని ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులకు, సైతాన్ సైన్యానికి ఇబ్బంది వస్తేనే పరామర్శలకు వెళ్తారని దుయ్యబట్టారు.