GNTR: వైసీపీ మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత మళ్ళీ పార్టీలో క్రియాశీలకం కానున్నారు. గతంలో మంత్రి పదవి కోల్పోవడం, నియోజకవర్గ మార్పుపై అసంతృప్తితో ఆమె ఏడాదిన్నరగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పార్టీ మారుతారనే ప్రచారం సాగినప్పటికీ, తాజాగా వైఎస్ జగన్ ఇచ్చిన భరోసాతో ఆమె మనసు మార్చుకున్నారు. త్వరలోనే వైసీపీ పటిష్టత కోసం ఆమె క్షేత్రస్థాయిలో పని చేయనున్నారు.