BHPL: ఖాసీంపల్లి అంగన్వాడీ సెంటర్-2లో ఆయాగా పనిచేస్తున్న అరుణ టీచర్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకుంది. సెంటర్-1లో ఖాళీ ఉండటంతో CPDO మల్లీశ్వరి ఆఫీస్కు పిలిపించి రూ. లక్ష డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. డబ్బులు లేవని చెప్పగా, వేరొకరి నుంచి రూ. 4 లక్షలు తీసుకొని ఇచ్చారని అరుణ ఆరోపించింది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టాలని కోరారు.