రంజాన్ (Ramzan) మాసం వచ్చిందంటే చాలు హైదరాబాదీలకు (Hyderabadis) హలీం గుర్తొస్తోంది. నోరూరుతోంది. వేడి వేడిగా, ఘుమఘుమలాడే హలీంను ఆరగించాలని అనిపిస్తోంది. మరి ఈ హలీం (Hallem) బట్టీలు ఒకట్రెండు కాదు.. నగరంలోని ప్రతి వీధిలో దర్శనమిస్తాయి. జంట నగరాల్లోని రెస్టారెంట్లు (Restaurants) హోటళ్లలో హలీమ్ తయారీలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) (Ghmc) మార్గదర్శకాలు ప్రత్యేక శ్రద్ధ వహించనుంది. నగరంలో హలీం తయారీ, విక్రయాలకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించి ప్రత్యేక సూచనలు, మార్గదర్శకాలు జారీ చేయాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ (Ramzan)మాసం వచ్చిదంటే చాలు జంట నగరాల్లో హలీం తయారీదారులు ఆఫర్లతో హోరెత్తిస్తుంటారు.
నగరంలోని ప్రతి వీధిలో దర్శనమిస్తాయి. మటన్ (Mutton) చికెన్ హలీంలను తయారు చేస్తూ.. ఆహార ప్రియులను ఆకర్షించేలా బోర్డులు దర్శనమిస్తాయి. అయితే వందల సంఖ్యలో దర్శనమిచ్చే హలీం సెంటర్లలో కెల్లా.. ఈ పది సెంటర్లలో మాత్రం హలీం సూపర్ టెస్టీగా ఉంటోంది. ఈ సెంటర్లలో తయారు చేసే హలీంకు భారీగానే డిమాండ్ ఉంటోంది. ప్రత్యేక పరిశుభ్రత హోటళ్లలో వినియోగించే మాంసం నాణ్యమైన ఆరోగ్యంగా ఉండేలా ప్రభుత్వం ఆమోదించిన ప్రదేశాల ద్వారా మాత్రమే మాంసాన్ని సేకరించాలని ఈ హోటళ్లు రెస్టారెంట్ల యజమానులను ఫుడ్ సేఫ్టీ ఆఫీసరులు(Food Safety Officers)కోరారు. గతేడాది హోటల్ యజమానులతో జీహెచ్ఎంసీ (Ghmc) అధికారులు సమావేశం నిర్వహించి మార్గదర్శకాలు జారీ చేయగా, వచ్చే వారంలోగా జీహెచ్ఎంసీ అధికారులు సమావేశమై మార్గదర్శకాలు జారీ చేసి హలీం తయారీలో నాణ్యత లోపించకుండా హోటల్ (Hotel) యాజమాన్యానికి సూచించనున్నట్లు సమాచారం. రంజాన్ మాసంలో హోటళ్ల చుట్టూ అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయడం సరైన పార్కింగ్ ఏర్పాట్లు చేయడం తప్పనిసరి.