E.G: కోరుకొండ మండల తహశీల్దార్గా డి.సుగుణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వహించిన సుస్వాగతం డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొంది విజయవాడకు బదిలీ కావడంతో, వారి స్థానంలో సుగుణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇచ్చారు.