AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా కేంద్రంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టింది. కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలో అనుమతులు పొంది నిర్వహిస్తున్న ఈ కేంద్రాలను మూసివేయాలని సంయుక్త కలెక్టర్ అపూర్వభరత్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, వేట్లపాలెం ఘటనతో అనధికారిక బాణసంచా తయారీకేంద్రాలను ముందే మూసివేశారు.