Health: ఆహారం విషయంలో జాగ్రత్త..ఈ సీజన్లో తీసుకోవాల్సిన పోషకాలివే
నేటి రోజుల్లో మంచి ఆహారం(food) తీసుకోవడంలో అందరూ వెనకబడుతున్నారు. కల్తీ ఆహార పదార్థాల వల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం వింటర్ సీజన్ ముగుస్తోంది. ఇక వేసవి సీజన్ దగ్గర పడుతోంది. మారుతున్న సీజన్‌కు అనుగుణంగా మనం కొన్ని రకాల ఆహారాలు(food) తీసుకోవాలి.
నేటి రోజుల్లో మంచి ఆహారం(food) తీసుకోవడంలో అందరూ వెనకబడుతున్నారు. కల్తీ ఆహార పదార్థాల వల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం వింటర్ సీజన్ ముగుస్తోంది. ఇక వేసవి సీజన్ దగ్గర పడుతోంది. మారుతున్న సీజన్‌కు అనుగుణంగా మనం కొన్ని రకాల ఆహారాలు(food) తీసుకోవాలి. అలాగే ఇంకొన్ని ఆహారాలను తీసుకోకపోవడం మంచిది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వింటర్ సీజన్ చివరి దశలో క్రమంగా చలిగాలులు తగ్గి వేసవికి దగ్గరవుతున్నాం. ప్రస్తుతం వాతావరణం అటు చల్లగా కాకుండా ఇటు వేడిగా కాకుండా సాధారణంగా ఉంది. బయట ప్రాంతాలు తిరిగేందుకు ఇది అనుకూలమైన కాలం అనే చెప్పొచ్చు. అయితే ఏ సీజన్ అయినా మారుతున్న టైంలో అది రోగ నిరోధక శక్తిపై కొంతమేర ప్రభావాన్ని చూపుతుంది. సీజన్ మారుతున్నప్పుడు అందుకు అనుగుణంగా ఆహార అలవాట్లు కూడా మార్చుకుంటే చాలా మంచిది.
బెర్రీ, పుచ్చ కాయ, పుదీనా, సలాడ్స్, చేపలు, యోగర్ట్ వంటి సులువుగా జీర్ణమయ్యే ఆహారాలు(food) ఇప్పుడు తీసుకుంటే చాలా మంచిది. ఇకపోతే పాస్తా, ఆలు గడ్డ, బ్రెడ్ వంటి అధిక క్యాలరీలు ఉండే ఆహారానికి కాస్త దూరంగా ఉండటం వల్ల ప్రయోజనం ఉంటుంది. వాతావరణం మారుతున్నప్పుడు మన శరీరానికి అనుగుణంగా తగిన పోషకాహారాలు తీసుకోవడం మంచిది. ఈ విషయాన్ని ఆరోగ్య నిపుణులు తరచూ చెబుతుంటారు.
ముఖ్యంగా ఈ టైంలో పండ్లు, కూరగాయలు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. బెర్రీ, పుచ్చ కాయ, ఈ సీజన్లో లభించే ఆకు కూరలు, కూరగాయలు తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్(Dehydration) కు గురి కాకుండా ఉండటమే కాకుండా జీవనశైలికి తగిన ఉత్సాహాన్ని కూడా ఇస్తాయి. అలాగే తృణ ధాన్యాలు, చిరు ధాన్యాలు తీసుకోవడం ఎంతో ఉత్తమం. క్వినోవా, గోధుమ, బ్రౌన్ రైస్, దలియా, జొన్నలు, రాగులు, హోల్ వీట్ బ్రెడ్ వంటి తృణ ధాన్యాలు, చిరు ధాన్యాలు శరీరానికి కావాల్సిన సుస్థిర శక్తిని ఇస్తాయి. రెగ్యులర్ ఆహారానికి బదులు ఇటువంటివి తీసుకోవడం వల్ల అద్భుత ఫలితాలను చూడొచ్చు. తేలిక మాంసాహారాలైన చికెన్, చేపలు, అలాగే చిక్కుళ్లు వంటి వాటి నుంచి లభించే ప్రోటీన్ కండరాలకు శక్తినిస్తుంది. కాబట్టి వీటిని కచ్చితంగా తీసుకోవాలి. అలాగే యోగర్ట్, పెరుగు వంటి ప్రొబయోటిక్ ఆహారాలు మీ జీర్ణాశయ ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తాయి. తేలిగ్గా, సులువుగా జీర్ణమయ్యే సలాడ్స్, గ్రిల్ చేసిన మాంసాహారం, స్టీమ్ చేసిన లేదా బేక్ చేసిన చేపలు మీ జీర్ణాశయ శక్తిని మెరుగుపరుస్తాయి.
అదేవిధంగా వాతావరణం మారుతున్న ఈ సమయంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డీప్ ఫ్రై ఫుడ్ తీసుకోకుండా ఉండటం మంచిది. డీప్ ఫ్రై చేసిన ఆహారం, ప్రాసెస్డ్ ఫుడ్స్, అధి కొవ్వు గల ఆహారం ఈ సమయంలో తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వాటిల్లుతాయి. అంతేకాదు ఈ ఆహారాల వల్ల జీర్ణక్రియ కష్టం అవుతుంది. అంతేకాకుండా స్టార్చ్ అధికంగా ఉండే పాస్తా, ఆలు గడ్డ, బ్రెడ్ వంటి వాటిని ఎక్కువగా తినకపోవడం మంచిది. సీజన్ మారుతున్నప్పుడు శరీరం డీహైడ్రేషన్(Dehydration)కు గురికాకుండా చూసుకోవడానికి కొన్ని పానీయాల జోలికి అస్సలు వెళ్లకూడదు. షుగర్ కంటెంట్ ఉండే పానీయాలు, అలాగే సోడా వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ఈ సీజన్లో తగినంత నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్(Dehydration)కు లోనుకాకుండా ఉండొచ్చు.