కెనడాలోని లాసల్లేలో భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ గ్రేవాల్(45) దారుణ హత్యకు గురయ్యారు. తన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేయగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని వ్యతిరేకిస్తూ నాన్సీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేవారు. ఈ దారుణంపై భారతీయ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.