»Union Minister Bhupathiraju Srinivasa Varmas Key Comments On Special Status
Bhupathiraju Srinivasa: ఏపీకి ప్రత్యేక హోదా కష్టమే.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
ప్రత్యేక హెదాఅనేది ముగిసిన అంశం అని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాబినెట్లో కూర్చొని తీర్యానిస్తే ప్రత్యేకహోదా రాదని మరోసారి చెప్పారు.
Union Minister Bhupathiraju Srinivasa Varma's key comments on special status
Bhupathiraju Srinivasa: ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదాను తీసుకోస్తామని టీడీపీ, జనసేన చెప్పడం.. వీటన్నింటినిక దృష్టిలో పెట్టుకున్న ప్రజలకు స్పెషల్ స్టేటస్ కచ్చితంగా వస్తుందని నమ్ముతున్నారు. గత ప్రభుత్వం సాధించలేకపోయింది ఈ కూటమి సాధిస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. కానీ అది అంత సులువైన విషయం కాదని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగానైనా ప్రత్యేకహోదా తీసుకురావాలని సీఎం చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోందని, కానీ అది ముగిసిన అంశం అని భూపతిరాజు పేర్కొన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ఉన్నంత మాత్రాన అది సాధ్యపడదు అని వర్మ తెలిపారు.
ఎప్పటి నుంచో స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని బిహార్ పాటుపడుందని అందుకోసం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు దీనిపై మాట్లాడుతూ.. తీర్మానాలు చేస్తే ప్రత్యేకహోదాలు రావని స్పష్టం చేశారు. అయితే ప్రత్యేక ప్యాకేజీ నిధుల ద్వారా రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలని, ఈ విషయంలో ఏపీ దీర్ఘంగా ఆలోచించి కేంద్రంతో సంప్రదింపులు జరిపి స్పెషల్ ప్యాకేజీతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. గత ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేదని అందుకే పోలవరంలో పలు సమస్యలు తలెత్తాయని కేంద్రమంత్రి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదా దక్కిందని, దానికి నిర్మాణానికి కేంద్రం పూర్తి సహకారం ఉంటుందని ఆయన అన్నారు. అయితే ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలా? కేంద్రం ప్రభుత్వం నిర్మించాలా అనేది కేంద్ర జలవనరుల శాఖ నిర్ణయిస్తుందని మంత్రి తెలిపారు. ఇవన్ని కొలిక్కి రావడానికి మరో రెండు నెలలు పట్టొచ్చని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చెప్పారు.