NRML: నిర్మల్లో శనివారం నుంచి జరగనున్న డ్రాయింగ్, టైలరింగ్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని డీఈవో దర్శనం భోజన్న శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మూడు ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం జరుగుతాయన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉండగా, పోలీస్ బందోబస్తు, మెడికల్ సిబ్బంది ఉంటారని తెలిపారు. అలాగే, మొబైల్ ఫోన్లకు అనుమతి లేదన్నారు.