ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు కాకినాడలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఓ సంఘటన చోటుచేసుకుంది. ఉప్పాడ వెళ్తున్న పవన్ కల్యాణ్‌కు ఒక గ్రామంలో ఓ చిన్నారి జనసేన ఫ్లాగ్ ఊపుతూ స్వాగతం పలికాడు. వెంటనే కాన్వాయ్ ఆపి జనసేనాని కిందకి దిగాడు. ఆ తరువాత చిన్నారిని పలకరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Deputy CM Pawan greets a child waving the Jana Sena flag on the way. Video viral
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటనలో భాగంగా నేడు ఉదయం 10.45 గంటలకు ఉప్పాడ చేరుకున్నారు. అక్కడి తీర ప్రాంతంలో సముద్రపు కోతను పరిశీలిస్తున్నారు. అక్కడి మత్య్సకారులతో మాట్లాడనున్నారు. వారికి ఉన్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. అలాగే సాయంత్రం నాలుగు గంటలకు పిఠాపురం ఉప్పాడ సెంటర్లో వారాహి బహిరంగ సభలో జనసేనాని ప్రసంగించనున్నారు. ముఖ్యంగా జాలరులు, మత్స్యకారులల సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయాలి అనే ప్రణాళికలును అధికారులతో చర్చిస్తున్నారు.
పర్యటనలో భాగంగా ఉప్పాడ వెళ్తున్నప్పుడు ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ కాన్వాయ్ వస్తుందని తెలిసి ఆయన అభిమానులు రోడ్లపైకి వచ్చి స్వాగతం పలికారు. ఈ తరుణంలో ఓ చిన్నారి జనసేన జెండా ఊపుతూ కనిపించాడు. వెంటనే పవన్ కల్యాణ్ కాన్వాయ్ ఆపి కిందకు దిగాడు. సంభ్రమాశ్చర్యాలకు లోనయైన కుర్రాడు వెంటనే పవన్ దగ్గరకు పరుగెత్తుకు వెళ్లాడు. పవన్ కల్యాణ్‌కు షేకాండ్ ఇచ్చాడు. వెంటనే భద్రతా సిబ్బంది వచ్చారు. తరువాత పవన్ కల్యాణ్ అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అందరికి అభివాదం చేసిన పవన్ కారెక్కి బయలుదేరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీన్ని చూసిన ఆయన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.