ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని శివనగర్ కాలనీలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీలను ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.