డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్‌నకు హైకోర్టులో ఊరట లభించింది. అతడిపై గతంలో నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టేసింది. నవదీప్ వద్ద డ్రగ్స్ దొరకలేదని, నిందితుడి వివరాల ఆధారంగా నవదీప్‌ను కేసులో చేర్చారని అతడి తరఫు న్యాయవాది పేర్కొన్నాడు. ప్రస్తుతం నాంపల్లి కోర్టులో విచారణ దశలో ఉన్న ఈ కేసును కొట్టివేస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది.