HYD: జైళ్ల శాఖ ఫీల్డ్ విజిట్‌లో భాగంగా IPS CV ఆనంద్ చర్లపల్లి జైలును సందర్శించాను. 2000లో తాను డీసీపీ ఈస్ట్ జోన్‌గా ఉన్న సమయంలో ఈ జైలు దేశంలోనే అత్యాధునిక జైళ్లలో ఒకటిగా ప్రారంభమై, శిక్షకే కాక సవరణ కేంద్రంగా ప్రశంసలు పొందిందన్నారు. ప్రస్తుతం సుమారు 1950 మంది ఖైదీలు ఉన్నారు. యోగా, పీటీ, విద్య, నైపుణ్య శిక్షణ, క్రీడల సదుపాయం కల్పిస్తున్నారు.