MNCL: జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో పిచ్చికుక్కల దాడిలో ఒక మహిళ గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం పిచ్చికుక్కలు దాడి చేయడంతో మర్రిపల్లి భీమక్కకు గాయాలయ్యాయి. దీంతో స్థానికులు చికిత్స నిమిత్తం భీమక్కను జన్నారం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామంలో ఎక్కువగా పిచ్చికుక్కల బెడద ఉందని గ్రామస్తులు వాపోయారు. కుక్కల బెడదను అరికట్టాలన్నారు.