భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ మోదీని చంపేస్తాం అంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vice President Jagdeep Dhankhar Praised Prime Minister Modi
Threat Call For PM Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామంటూ నేషనల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ(NIA)కి ఓ ఆగంతకుడు ఫోన్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ బెదిరింపు ఫోన్ కాల్(THREAT CALL) రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. తమిళనాడులోని చెన్నై, పురశైవాకంలోని ఎన్ఐఏకి ఈ కాల్ వచ్చింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ వ్యక్తి చేసిన నెంబరును పోలీసులకు అందించారు. దీంతో చెన్నై సైబర్ క్రైం అధికారులు రంగంలోకి దిగారు. దర్యాప్తు చేపట్టారు.
ఆ గుర్తు తెలియని వ్యక్తి మోదీని(MODI) చంపేస్తామంటూ హిందీలో మాట్లాడినట్లు ఎన్ఐఏ(NIA) అధికారులు చెబుతున్నారు. కాగా ఆగంతకుడు ఏ సిమ్ కార్డు వాడాడు? ఎక్కడి నెట్వర్క్ నుంచి ఫోన్ చేశాడు? ఏ ప్రాంతం నుంచి ఈ ఫోన్ వచ్చింది?లాంటి విషయాలను తెలుసుకునేందుకు సైబర్ క్రైం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే వాంటెడ్ క్రిమినల్స్‌ని పట్టుకునేందుకు చెన్నైలోని ఎన్ఐఏ పోలీస్ కంట్రోల్ రూం నంబర్లను ప్రకటించింది. ఆ నెంబర్‌కి కాల్ చేసి వ్యక్తి ఇలా మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.