»Delhi Minister Atishi In Icu After Blood Sugar Levels Drop Amid Hunger Strike
Atishi : నిరాహారదీక్ష… క్షీణించిన దిల్లీ మంత్రి ఆతిషి ఆరోగ్యం
ఐదు రోజులుగా నిరాహార దీక్షలో ఉన్న దిల్లీ మంత్రి ఆతిషి ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆమెను తక్షణం ఆసుపత్రిలో చేర్పించాల్సిందిగా వైద్యులు సూచించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో ఉన్నారు.
Delhi Minister Atishi In Icu : ఐదు రోజులుగా ఆప్ మంత్రి ఆతిషి(Delhi Minister Atishi) దిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్నారు. తాజాగా మంగళవారం తెల్లవారు జాము నుంచి ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో ఆమెను తక్షణం ఆసుపత్రిలో చేర్పించాల్సిందిగా వైద్యులు సూచించారు. ప్రస్తుతం ఆమె అక్కడి జై ప్రకాష్ నరాయణ్ హాస్పిటల్లో(LNJP) ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని ఆప్ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ వెల్లడించారు.
నిరాహార దీక్ష ప్రారంభించిన దగ్గర నుంచి ఆమె ఏమీ తినలేదు. ఫలితంగా సోమవారం రాత్రి ఆమె రక్తంలోని షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోయాయి. మంగళవారం తెల్లవారుజాముకి చక్కెరలు 36కు చేరుకున్నాయి. ఆమె పరిస్థితి మరింత క్షీణించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. తక్షణం ఆమెను ఆసుపత్రిలో చేర్పించాలని సలహా ఇచ్చారు. దీంతో ఆమెను తెల్లవారుజామున హుటాహుటిన ఆసుపత్రికి(Hospital) తరలించారు.
దిల్లీలో నీటి సమస్యను తీర్చాలన్న డిమాండ్‌తో ఆమె ఈ నెల 21న నిరాహార దీక్షకు కూర్చున్నారు. హర్యానా నీటిని విడుదల చేసి దిల్లీలో నీటి కొరతను తీర్చే వరకు పోరాడతానని అన్నారు. దాదాపుగా 28 లక్షల మంది ప్రజలు దిల్లీలో నీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిరవదిక నిరాహార దీక్షకు(Hunger Strike) కూర్చున్నారు. నాలుగు రోజులుగా ఏమీ తినకపోవడంతో ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఐదో రోజైన మంగళవారం ఆమెను ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఆమె త్వరిత గతిన కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆప్(APP) తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది.
🚨 Water Minister Atishi’s health deteriorates 🚨
Her blood sugar level dropped to 43 at midnight and to 36 at 3 AM, after which LNJP Hospital doctors advised immediate hospitalization. She has not eaten anything for the last five days and is on an indefinite hunger strike… pic.twitter.com/nl5iTfnwnT